సంకురాత్రి పండుగ:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
పండుగ పందుగ పండుగ
పెద్ద సంక్రాంతి పండుగ
మూడుదినాల పండుగ
ముచ్చటయిన పండుగ  
                               
సంబరాల పండుగ
సంకురాతిరి పండుగ
సనాతనమైన పండుగ
సంప్రదాయాల పండుగ                   ||పండుగ|| 

అరిసెలు తినిపించె పండుగ
పొంగలి వండించె పండుగ
కొత్తబట్టలు కట్టించె పండుగ
చిరునవ్వులు చిందించె పండుగ                           

పలురకాలపూలను పూయించె పండుగ
ధాన్యాలను ఇంటికితెప్పించె పండుగ
పట్నవాసులు పైకెగిరించె పండుగ
పరమానందాన్ని కలిగించె పండుగ      ||పండుగ||  

పిల్లలపై రేగిపండ్లుపోయించె పండుగ
పశవులను పూజింపజేసె పండుగ
పతంగులను ఎగురింపజేసె పండుగ
పందెపుకోళ్ళతో పోరుపెట్టించె పండుగ 
     
బడులకు శెలవులిప్పించె పండుగ
ధనుర్మాసంలో వచ్చె పండుగ
రంగవల్లులు వేయించె పండుగ
గౌరమ్మగొబ్బిల్లు పెట్టించె పండుగ       ||పండుగ||    
 
కవులతో కవితలురాయించె పందుగ
కవిసమ్మేళనాలు జరిపించె పండుగ
కవులను సత్కరింపజేచె పండుగ
కైతలపోటీలను పెట్టించె పండుగ             

చలికాలాన వచ్చేటి పండుగ
చలిమంటలు వేయించేటి పండుగ
వచ్చింది సంక్రాంతి పండుగ
తెచ్చింది సంబరాలను పండుగ          ||పండుగ|| 

================================================
🌷🌷🌷🌷💐💐💐💐అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు💐💐💐💐🌷🌷🌷🌷



కామెంట్‌లు