పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ప్రతిభా పోటీల్లో దామోదర నిత్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు నిత్యశ్రీని ప్రోత్సహిస్తూ జ్ఞాపికను అందజేసారు. విద్యా స్థాయిలో ప్రథమంగా నిలుచుటతో పాటు, సక్రమంగా హాజరు, క్రమశిక్షణతో మెలగుట, దస్తూరితో కూడిన లేఖనం, ఉచ్చారణ దోషాలు లేకుండా పఠనం, సకాలంలో రాతపనులను పూర్తి చేయడం, సృజనాత్మకత ఆటపాటల్లో నైపుణ్యం ప్రదర్శించుటలందు నిత్యశ్రీ ముందు వరుసలో ఉన్నందున ప్రశంసిస్తూ ఈ జ్ఞాపికను బహూకరించామని ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, పైసక్కి చంద్రశేఖరం, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు అన్నారు. సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, ఉపసర్పంచ్ డోల చిన్నారావు, పాఠశాల అభివృద్ధి కమిటీ ఛైర్ పర్సన్ బలగ రజనీ కుమారి, వైస్ చైర్మన్ గేదెల తేజేశ్వరరావు, తల్లిదండ్రులు దామోదర మమత, దామోదర శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిత్యశ్రీకి ప్రతిభకు ప్రోత్సాహక బహుమతి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి