సుశీలమ్మకి గొప్ప ఆలోచన వచ్చింది. తన మనవళ్లు మరియు మనవరాళ్లకు ఫోన్ కాల్స్ చేసి మాట్లాడింది. ఈ వేసవి సెలవుల్లో అందరూ తమ ఇంటికి రావాలని, ఈ సెలవుల్లో వినోదాత్మక ఆటలు చాలా ఉన్నాయి అని, ఆ ఆటల పోటీలలో గెలిచిన వారికి తన పుట్టిన రోజు నాడు విలువైన కానుకలు ఉంటాయని చెప్పింది. ఆయితే మొబైల్ ఫోన్లకు, టీవీలకు పూర్తిగా దూరంగా ఉండాలని షరతు విధించింది. కొందరు నిరాశ పడ్డారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం కష్టమని, టీవీల్లో వినోదాత్మక క్రీడలు అప్పుడే వస్తాయని చెప్పారు. కానీ సుశీలమ్మ ఒప్పుకోలేదు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంటే, మన ఆరోగ్యానికి చాలా మంచిది అని, టీవీలలో ఆ సెలవుల్లో వచ్చే కమర్షియల్ ఆటలు దేశభక్తిని దెబ్బ తీస్తాయని, ఇంట్లో వాళ్ళ మధ్య కూడా సమైక్యతను దెబ్బ తీస్తాయని అవి ఆ ఆటలకు దూరంగా ఉండాలని చెప్పింది. సెలవుల్లో ఆటల్లో గెలిచిన వారికి చాలా విలువైన గిఫ్ట్స్ ఉంటాయని చెప్పింది.
ఒప్పుకున్నారు.
వేసవి సెలవులు మొదలు అయినాయి. అందరూ చేరుకున్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా తాతయ్య అందర్నీ ఊరంతా తిప్పుతూ పల్లెటూరిలో ఒకప్పుడు బాగా సాగి, ఇప్పుడు కనుమరుగైన రకరకాల వినోదాలను చేయించాడు. మధ్యాహ్నం భోజనం తరవాత పోటీ ఆటలు. క్యారం బోర్డ్, పచ్చీస్, అష్టాచెమ్మ ఇంకా చాలా ఆటల్లో పోటీలు. సాయంత్రం వేళ వినోదాత్మక కార్యక్రమాలు. రాత్రి పడుకునే ముందు సుశీలమ్మ అందరితో కథలు, కబుర్లు. ఇలా రోజులు మంచులా కరగి పోయాయి.
సుశీలమ్మ పుట్టినరోజు వచ్చింది. మనవళ్లు మరియు మనవరాళ్లూ బాగా సెలబ్రేట్ చేసారు. ఆయా పోటీల్లో గెలిచిన వారికి మంచి విలువైన గిఫ్ట్స్ ఇచ్చింది సుశీలమ్మ. మిగతా వారికి కూడా బహుమతులు ఇచ్చింది. ప్రతి వేసవి సెలవుల్లో ఇక్కడికి వచ్చి, ఎంజాయ్ చేయాలని అందరూ అనుకున్నారు. సుశీలమ్మ అందరితో ఇలా అన్నది. "సెల్ ఫోన్లు, టీవీలకు అందరూ దూరంగా ఉండాలని, చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పింది. సరే అన్నారు అందరూ.
వినోదం: సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి