ఊరుగాలి ఈల 107:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఊరు ఊకనే ఉండదుగా ఆరాటం అమ్మలా పిల్లలై
కరువుదీర కడుపులదాచే పల్లెచలికలికి నెగడుసేగ
అవునన్నా కాదన్నా అమ్మేఊరై నవ్వింది పల్లెతల్లి

ప్రపంచబాధంతా మోసేఅమ్మవొడి ఏదీ తనబాధ!
అదే గుండెచెరువు గట్ట్లుతెగి శోకానదేలే ఊరుకథ
ఎప్పుడో వచ్చేచుట్టానికే నొప్పైతే నే పుట్టిపెరిగిన!!

మలివయసు ఉడిగేచెట్టు అనుభవమే పల్లెజ్ఞాని
పరుగేమనసు ముదిమికీళ్ళూకాళ్ళునొచ్చే ప్రకృతి
చెయ్యిపట్టుబిడ్డా చెప్పుతొడుగు నేలేస్తే ఊరేనడకై

నడకరాదని చెట్టు నడవలేనని గట్టు నది మాఊరే
ఆశ నగకాదు పండుగబువ్వ కాదు పల్లెనవ్వేగంజి
ఊరు పిలిచేమట్టి కరస్పర్శ నేనే కొమ్మలూగే చెట్టు

నేనంటే ప్రేమ ఊరుకు ఉరికే బండి గిర్రని కాబోలు
కాదు అమ్మవని లేదు మనిషని నడకేనచ్చే పల్లెకు
మాటతీపిరసం బాటపాదరసం పల్లె సరసంపూలే

అన్నీ ఉంటే పల్లె దేవతేగా మంచీచెడు చెప్పేనవతే
కంప్యూటర్ల చదువుగొప్ప పల్లెచదివే నే దుర్భినేసీ
ఏది శక్తో చెట్టుపచ్చేనేర్పే ఊరు కథే బలం చూడు

మైదానం రేపటిదా ఆటమరీ పోటీలేదు పల్లేఆడేసీ
కవితకు ఊర్లే వస్తువు పల్లీయం సడినడకలే అల్లిక
నన్నునేను రాయని పదం పల్లె  ఆకుపచ్చఎదసిరి
====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు