ఊరుగాలి ఈల 109:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఊరని నేను ఈలేస్తే చెంగున విరితోట  ఊగే లీల
రాలే ఆకులరాత లేలేత పత్రాలప్రేరణ ఊరేకావ్యం
మాటరాదు మాట్లాడరు ఊరుసిగ్గే చూడ ముగ్గేసే

దగ్గరకొస్తే నవ్వు చాలు ఊపిరి ఊరు నన్నేతలిచే
కాలంలో అక్షరం బతికేది ఊరు కృతిసోపతి జగతి
బువ్వకుండ దూపకూజా పల్లెకడవెత్తే పాటనోటసీ

నిమ్మలం పదిలం అమ్మా ఏంది చిన్నదా పల్లెభామ
ఊరంటే నాకు ఓపిక నేర్పిన అమ్మ దెబ్బ ఎడాపెడ
హద్దులుండు ఓకే మాటవిను ఓకే పల్లే మంచిదిసీ

అనాదిగా ఊరు అనాథకాదు ఎందరో బతికే ఈల
కళంతా ఊరుదే మేమే మేమేఅనేది పిచ్చిప్రేమేరా
ఎవడిది వాడికే ఆనందం కెలకకు పల్లెరంగే మారు

ఉండేవారిదీ వచ్చీపోయేటోళ్ళది పల్లే రాలీరాలక
కొప్పులపూలు మెడనగ నడుమొడ్డాణం ఊరేగని
నింగిమెరిసే మబ్బురుమే వానేది ఊరు జలగీతం

నాకు తెలుసు ఊరేమారే నేను మారలే చెప్పేమట్టీ
నా షానంతా ఊరే ఊరు తెలివి నాదే బతికేమేధ
సారనే నన్ను ఉంటేఊరు లేదానీరు కంటిఇంటిల

తరాలు రాసినరాతే ఊరు రాతికట్టు పునాదిపక్క
కడుపుకు తిండి పొయ్యికి కట్టె ఒంటిబట్ట పల్లెసిరి
ఇంకేం వద్దు ఊరుమంచి మాటమంతీ నా గుండే

===================================

(ఇంకా ఉంది)

కామెంట్‌లు