ఊరుగాలి ఈల 114:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
నిడివి చిన్నది చిత్రం పెద్దది ఊరుదీర్ఘం గుండె ధీర
అమ్మవిడువదు పిల్లలబడి తడిపలక పల్లేబలపం
అన్నీ అందిచ్చే ఊరు నాకు ఏమీ కాదు నేను చెట్టే

ఎదిరించలే ఎదపరిచి రాస్తే చదివే ఊరు ఆరుద్రలే 
అరిగిన అడుగుల కడిగిన ఊరుచూడ ముత్యమే
పల్లెప్రేమ చదివినా కవిత చదివించినా సాల్యూటే 

రీడర్స్ రిసెప్షన్ బాగని చెప్పేది కొంతే అర్థంచేసుకో
అందరికీ ధన్యవాదాలు కలం అందించే ఊరువైపు
ఊరులో పుట్టి పల్లెదిరిగే మది టైంలేక 'నాట్ రెడ్'

పట్టించుకోదు ఊరు మదిలో మాట చదువే గొప్ప
కవులు రచయితలు డాక్టర్స్ థాంక్స్  చదివిరిచ్చగ
రాయడం గొప్పే చదివేలా చేయడం మాగొప్ప కళ

అక్షరపిపాసులు ఊరు ప్రేమికులు పల్లె కవిత్వజీవే
సాహిత్యం సాంస్కృతికం వెనుకే బతుకే పల్లెపాట
ఊరు ఉనికి పచ్చదే మీరు నడిచినదే కొత్తగ రాసే

అబ్బురం సంబురం అంబరాన నేలకల పూచేఈల
మూలమూల మలుపులేక నవ్వే పల్లె కృతి గీతిక
ముదురుటాకులున్న ఎద పల్లెనవ్వే నా ఊపిరైపో

ఒకరుకాదు ఎందరో మిత్రులు చేయూత మాటతో
పల్లె కానుక చదువ రాసే కొత్త చికిత్సగ కవి డాక్టర్
అందాలు విరిసే ఆట నెమలి ఊరు పూదోట వానై

====================================
(ఇంక ఉంది)

కామెంట్‌లు