నవ్వుతూ బ్రతకాలిరా - 22:-సి.హెచ్.ప్రతాప్
 1.  పరంధామయ్య : మీ తల వెంట్రుకలు ఎలా రాలిపోయాయి?
కృష్ణయ్య: దిగులు.
 పరంధామయ్య : సర్వీసులో వుండగా బొలెడు డబ్బు సంపాదించి హాయిగా కాలు మీద కాలు వేసుకొని దర్జా వెలగబెడుతున్నావు. ఇక నీకు  దిగులు దేనికి?
కృష్ణయ్య: వెంట్రుకలు ఊడిపోతున్నాయని.
2. ఒక కాలేజీ బయట " వాహనములను నెమ్మదిగా నడపండి,విధ్యార్ధులు జాగ్రత్త" అన్న బోర్డును ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు పెట్టారు. ఒక ఆకతాయి స్టూడెంట్ దాని పక్కనే లెక్చెరర్ల కోసం వెయిట్ చెయ్యండి" అని రాసాడు.
3. మీ విధ్యార్ధులంతా ఒక మహాత్మా గాంధీనో, భగత్ సింగో లేక సుభాష్ చంద్ర బోసు గానో తయారు కావాలి" ఆవేశంగా ఉపన్యసించాడు సోషల్ టీచర్.
" ముందుగా మాకు పాఠాలు చెప్పే మీరు ఒక సర్వేపల్లి రాధాకృషన్ , సి వి రామనో లేక అబ్దుల్ కలం గానో మారితే బాగుంటుంది సార్" వెనుక బెంచీల నుండి అరిచాడు ఒక తుంటరి కుర్రాడు.
4. ముందూ వెనుక చూడకుండా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసేసి ఆ తర్వాత వాటిని తీర్చలేక చేతులెత్తేసేవారిని ఏమంటారురా రాజు ?" అడిగారు టీచర్.
" ఆర్ధిక మంత్రి అంటారండి"చటుకున చెప్పాడు రాజు.

కామెంట్‌లు