దొంగల ధర్మారం అడవిలో ఒక వేటగాడుఉండేవాడు.
అతడు ప్రతిరోజు పక్షులను, జంతువులను వేటాడి పక్క ఊర్లలో కెళ్ళిఅమ్ముకునేవాడు.
ఒకరోజు నెమలిని వేటాడి తీసుకెళ్తుండగా పోలీసులకు దొరికాడు.జైలు పాలుఅయ్యాడు.
అటవీ అధికారులు
ఆ నెమలిని అడవిలోవదిలిపెట్టారు.
జైలు నుంచి విడుదల అయినాక దొంగబుద్ధి మానుకోలేదు.
వేటగాడు మళ్లీ వేట ప్రారంభించాడు.
అప్పుడు ఏనుగు కంట పడతాడు.ఒరేయ్ వేటగాడా! అడవిలో పక్షులు జంతువులు లేకుండా చేస్తున్నావు.
నీవు అడవికి పట్టిన శనివి. దొరకబట్టి తొండంతో ఒక్కదెబ్బవేస్తుంది.
దొరకబట్టి చెట్టుకు కట్టేసింది. జంతువులను పిలిపించింది. వీన్ని ఏం చేస్తాం! చెప్పండి అని జంతువులని అడిగింది.
ఈ వేటగాన్ని మళ్లీ మన చుట్టుపక్కల కనబడనీయకుండాచేయాలి.
మళ్లీ వేటాడితే ప్రాణాలతో బతకనివ్వద్దని నెమలి బెదిరించింది.
అన్ని జంతువులు కలిసి అడవి నుండి పంపించి వేశాయి.అప్పటినుండి వేటగాడిలో మార్పు వచ్చింది. ఏ వేటగాడిని కూడా అడవిలోకి రానివ్వకుండా జాగ్రత్తపడ్డాడు.అతనిలోని మార్పును జంతువులు మెచ్చుకున్నాయి.
తగిన శాస్తి;- బౌగోళ్ళ అక్షిత్-7వ, తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల -బక్రిచెప్యాల -జిల్లా:సిద్దిపేట-9704865816.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి