ఊరుగాలి ఈల 74:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆనందంలో ఊగే ఊరు ఎండవాన పొడితడి నేను
పలక చేరచేత బలపం తావచ్చు స్వేచ్ఛే నేనౌపల్లె
ఇంద్రధనుస్సు రంగుల కలల తెలుపు నేనను నేల

జ్ఞానభూమి నేర్పే విజ్ఞానగనిచే నా విద్య రవ్వంత 
గాలి అలల చెలి చెలిమే నాలోని మట్టివాసన 
తలనిమిరిన స్పర్శలో ఆకు ఎద నేననే పల్లెకావ్యం

నన్ను మోసే భుజాల ఊరు నడక అలిసిన బాట
కోతులు చెట్ల నయగారం నాదైతే  వడితిరిగేఆట
చెడుగుడులో డెడ్ లైన్ నో కూత గొంతుపట్టే రన్

చెరువు ఉనికి ఉతికే బట్టలు నీళ్లు ఒడ్డెక్కవు నే ఫ్రీ
తోటకు పోతే పూలు కూరగాయలే దా ఆకలి కలి!
మాట ఖూఁబ్ పెట్టదు బువ్వ పల్లెసిగ్గు నవ్వు నాదే

ఆశ ఆశాభంగం ఒకేబాట కొసమెరుపే నాలో నిద్ర
నిద్రంటే ముద్దే పగలురాత్రి నాదే అది లేక బాధేగా
రేపటి మైదానం ఆట పాట నా ఎద ఊరే సారైనది

చదువమనే బడి పాఠం సారు నన్నుగన్న మమత
చదువు నేర్పే చనువు నా ఊరు పసిగట్టే నా మది
విద్య కూటికే సేద్యం ఆకలిదీర్చ పద్యం దూప నేలే

ఎన్ని బలపాలు తిన్ననో నా చదువు గట్టి పలకే
సారు కొట్ట విరగలే కర్ర పచ్చిచింత వాతే  పోలేదే
ఉల్లివాసన ఊరంతా పాఠంరాలే పట్టే చెయ్యి నేనే

====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు