ఊరుగాలి ఈల 75:-డా.టి.రాధాకృష్ణమాచార్యులు
అక్కడ వినిపించే ఈల పాట పిలిచింది నన్నేనా
రాకడ నాది తెలిసి మైత్రికి రమ్మన్న సూచీ నేమో
ఆశపడే మనసు వేగం హెచ్చి నడక తగ్గే కథ మారే

వాన తడిసి అడిగేనా నన్ను ఆటకు నవ్వే పూదోట
అలుపుసొలుపు లేక పాతరోజు పడిలేచే ఏదేదని 
పిట్టగూళ్ళ సరసం బొమ్మలాట పెళ్ళిమోజు క్రేజ్

మనిషి తీపిగోల అమ్మ గద్దింపు నాపై వాలే పిట్ట
అప్ప చేతిల పెట్టే ఊరువాడ ఆడే నన్నే తలకెత్తీ
ఇంతకన్నా గొప్ప మరేది మదిమెచ్చే పని నాదే

చెరువునీళ్ళు తెచ్చే బిందెలే గలగలమనే నా చేత
దోస్తీ కటీఫ్ చెప్పలే పల్లె జనం కూడె ఎదల నమ్మిక
సొమ్ముకాదు గింజలే బేరం ఎద పిరం  గుండె చౌక

చెలిమి చిన్న సోపతి పెద్ద లెక్కలేని కూన నేనేగా
బడి ఇంటిబాట ఇల్లు వీధిబాట ఆడే ఆటలే యాది
అమ్మ అత్త అక్క అమ్మి నా రక్తమే వీడె ఊరు తీగ

సన్నూరు జాత్ర ఇప్పుడే వచ్చు పొందెద దైవదీవెన
కోనేరు తడిపే పాదాల బత్తీసాలతీపి షాప్ లే నావి
నడిచిన దూరాలు చెరిపే తీపికల మోదుగు పూలై

పర్వతగిరి చేర అన్నారం కల్లెడదాట  చిన్నమ్మిల్లే!
కొండాపురం బావ పర్వతగిరి ప్రేమ పెదనాన్న పాపే
అందరిని చేరి మమతపెంచే బంధమే నాలోన చేరే
=========================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు