పేరు వింటేనే ఊరని దరిజేరు స్పర్శమది సంతకం
బాసాడె ఎద మమతలు బండెడు నాతో పసిపల్లె
రమ్మనే నన్ను యాదిలో మదివిప్ప నేడు విన నేల
పాత నీరు పోయే కొత్త వచ్చే మాఊరు మారలే
ఎన్ని మారినా మనిషి తాను పల్లెజీవే మనసదే
హోదా బాధ పక్కకు ఊరు గొప్పగ పెంచే మనల
తలవాల్చ ఎదలో ఊరు రివైండ్ నిన్నలో రిఛార్జ్ నే
ఆత్మ నిదురలేచే పాట అమ్మనోట నాదే లాస్యం
అవని ఆటల బాల ఊరు కవనమై వినె చిన్నకథ
ఆమెలేని నేను లేనను నిజం నేనులేని ఊరుతీరు
గలగల ఆకుల సడి కదలని చెట్టు నుడి నే ఊరు
ఉమ్మగిల్లింది అమ్మ చెమ్మ కొమ్మల తీపి బాధ సీ
ప్రేమ గొప్ప చీమ భామ నవ్వు తాజా పల్లె కోర్ట్ దా
మరిచిందా ఊరు నన్ను చిలిపి దులిపే చెలిమేగా
ఎంతైనా చెప్పు ఏలాగైనా మళ్లీ పల్లె ఇచ్చ తీరేనా
చెట్టే నా బతుకు కలలో కళ ఊహ ఊసే కథనం
ఊల ఆవగింజ ఈల చింతగింజ చిరిగిన చెడ్డీ నడ్డి
కోయిల నెమలి చిలుకలే పాటఆట మాటే యాది
బతికిన కాలం తీపిపుల్ల పీల్చేగాలే వేళ్ళ గాధలది
అమ్మ ఊరు తీరైన కొలువు పూలగాలి బతుకులే
ఎసరుకుండ బువ్వ పచ్చిపులుసుదోస్తీ మస్త్ ఖుష్
================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి