ఊరుగాలి ఈల 77:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
మట్టి దుబ్బ పల్లేర్లు గొప్పేది ఊరు ఈల నింగి దేల
పుట్కే మట్టిల తిరిగే దుబ్బల గ్రేట్ ఊరు క్లే నేను
ఆడీపాడిన అందం వీడని బంధం నేనే తోటమాల 

అదును పదును పల్లెమాట ఉత్తుత్తి కాదు హోరు
చేదబావి తోడే కుండ నీరు నోటి జల తడిసే ఊరు
ఆకుల జలకం దోసిలి దూపెండే చేనుకాలం నవ్వే

ఊపే ఉయ్యాల గిచ్చి కయ్యం ఊగే గిల్లికజ్జం నాదే
ఊరెందుకు పిలవాలి నన్ను చుట్టాన్నా ఊర్ల నేను
భుబంమీద చెయ్యి దాటించే గొయ్యిపల్లె ఎద నేనౌ

పెళ్ళీపిల్లలు పెన్నీపైసా అన్నీఎక్సెప్షన్ ఊరే సీ ఐస్
కైంచీ తొక్కిన సైకిల్ రాయెక్కించే నేనే కింద బెదిరి
గదిగదీ! ఊరంటే దెబ్బ మమత నొప్పిలేని సుధల

రంగుకులమత గోలలేదు చదువు తేడాలేని పల్లె 
పనిల చేయిచేయి కలిపే ఊరుమాట నే పూదోట
భిన్నరంగులు వైవిధ్య పరిమళం ఉన్న నేల ఏకత

పలుకు మెతుకు పంట్లో రాయి బాధలేని పల్లేకృతి
బొంగరాలు ఉంగరాల తల ఆటనే ఆత్మీయ మది
 ఆనంద లహరి ఊరు నను పిలిచే విరిమల్లె ఖిలా

పాడిలేని ఊరు పాటలేని పల్లె ఏది మనిషి చూడ
ఆమె మేడ నా గుండె జాడ పల్లెముల్లె విప్పే వెన్న
ఆటలో అందాలు పడిలేచే ఫీట్స్ లైఫ్ లేగదూడ 
====================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు