*సిజ్జు తెలివి*:- నరాల భార్గవి-8వ,తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-బక్రిచెప్యాల.-జిల్లా.సిద్ధిపేట.-9704865816.
 సిజ్జు,మజ్జు ఇద్దరు అన్నదమ్ములు.
వీళ్ళిద్దరిలో మజ్జు అమ్మ,నాన్నలు ఇచ్చిన డబ్బులను స్నేహితులతో కలిసి ఖర్చుపెట్టేవాడు.
కాని సిజ్జు మాత్రం డబ్బు ఖర్చు చేయక పొదుపు చేసేవాడు. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నలు పొలం పనులకు వెళ్తూ మజ్జు,సిజ్జులకు చేరో 100 రూపాయలు ఇచ్చి వెళ్లారు.ఇచ్చిందే తడవుగా మజ్జు స్నేహితులతో  వెళ్ళిపోయి డబ్బులు జల్సాగా  ఖర్చు పెట్టాడు.
కాని సిజ్జు మాత్రం గల్ల డబ్బాలో వేసుకొని దాచుకున్నడు.
ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి.వర్షం ప్రారంభమైంది.
అమ్మా,నాన్నలుసాయంత్రం పొలం పనులు చేసుకొని త్వరత్వరగా ఆటోలో ఇంటికి వస్తుండగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరుగుతుంది. అంబులెన్స్ లో ఇద్దరినీ హాస్పిటల్లో చేర్చుతారు.వాళ్ళ నాన్నకు దెబ్బలు మామూలుగా తగిలాయి.
కానీ వాళ్ళ అమ్మకు కాలు,చేయివిరిగింది.ఆపరేషన్ కు 20000ల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు.
ఇంటికి వచ్చినాన్న దిగులుగా కూర్చున్నాడు.
మజ్జు,సిజ్జు ఇంటికి వచ్చారు.
నాన్నను చూసి కంగారుపడ్డారు.
ఏమైంది నాన్న నీ ఒంటికి గాయాలేంది!
అమ్మ ఏది నాన్నా! అని ఏడ్చుకుంటు కొడుకులడిగారు.
కంగారు పడకండి బిడ్డా!అని కొడుకులను గుండెలకు హత్తుకొని జరిగిన విషయంచెప్పాడు.
అమ్మకు కాలు చేయి విరిగింది. ఆపరేషన్ కోసము 20000 రూపాయలు కావాలి.ఎవరిని అడగాలి.ఎలా అప్పుచేయాలి అని దిగులుతో కొడుకులతో చెప్పాడు.
మజ్జు బాధపడ్డాడు.కానీ ఏమి చేయలేకపోయాడు.కానీ సిజ్జు మాత్రం తెలివైన కుర్రాడు కాబట్టి
చిన్నప్పటినుండి మీరు ఇచ్చిన డబ్బులు నేను గల్ల డబ్బాలో దాచి పెట్టాను.
వాటిని పగలగొడదాం.ఎన్ని డబ్బులు అయినా కూడా అమ్మ ఆపరేషన్ కోసం ఖర్చు పెడదామని సిజ్జు నాన్నకు ధైర్యం చెప్పాడు.
నాన్నకు కొంత ఊరట అనిపించింది.
సరే బిడ్డా! అమ్మ మంచిగైన తర్వాత నేను మళ్ళీ నీకు ఆ డబ్బులు ఇస్తాను అని సిజ్జుకు నచ్చ చెప్పాడు.అప్పుడు దేవునికి కొబ్బరికాయ కొట్టి గల్ల డబ్బాను పగులుగొట్టారు. అందులో అమ్మ ఆపరేషనుకు సరిపడా 20వేల రూపాయలు ఉన్నవి.అప్పుడు నాన్నకు చాలా సంతోషం అయింది.ఈ డబ్బులు అమ్మ ఆపరేషన్ కు ఖర్చు పెట్టు నాన్న!
అందరం మంచిగా ఉంటే మళ్ళీ డబ్బులు సంపాదించుకుందాం అని సిజ్జు నాన్నకు ధైర్యం చెప్పాడు. చిన్నవాడివైనా నీ తెలివిని మెచ్చుకుంటున్నాను.అని
నాన్న అనగానే కళ్లలో ఆనందబాష్పాలు నిండాయి. ఈ విషయాలన్నీ మజ్జు వింటున్నాడు.కాని ఏమిచేయలేని పరిస్థితి.నేను కూడా చిన్నప్పటి నుంచి అమ్మానాన్నలు ఇచ్చే డబ్బును పొదుపు చేసి ఉంటే మంచిగుండు.నేను ఏం చేయలేకపోయాను అని బాధపడుతుంటే నాన్న, సిజ్జు ఇద్దరు కలిసి మజ్జును ఓదార్చారు.‌
ఇప్పటినుంచైనా సిజ్జు లాగా పొదుపు చేయడం నేర్చుకో! భవిష్యత్తులో వేటికైనా అవసరం పడుతుందని నాన్న హితబోధ చేయగా మజ్జులో మార్పు వచ్చింది.
అందరు కలసి ఆసుపత్రికి వెళ్లి అమ్మకు ఆపరేషన్ చేయించుకొని తిరిగి ఇంటికి వచ్చారు.
డబ్బు ఉన్నట్లయితే పొదుపు చేయడం నేర్చుకోవాలి అని మజ్జు తెలుసుకున్నాడు.



కామెంట్‌లు