మెడమీద కత్తి మగువ ఊపేకొంగు పేగు రక్తం వీడే
గాలిఊయల పతంగి పాటల ఆడే నన్ను చేరేపల్లే
నేను ఒంటరికాదు నాలా ఎందరో ఊరు పాలపొద
బతికిన బతుకే ఊరు కాలుచెయ్యి కన్నుపెన్నుబ్రో
సంజీవ హయగ్రీవ ఆనంద సంతోషం కళ్ళే ఊపిరి
పుట్టుమచ్చ పుచ్చకాయ తీపి ముక్కోపి పల్లె వాతే
గువ్వపిలువని గూడు అవ్వపెట్టని బువ్వ పల్లెలేదే
అవని ఓర్పు జానకి వనిలో జాన మనిషికే జాకీ
పగలు వగలు విరిసే వెన్నెల కన్నుల పల్లెఎద'రాధ'
చెవులు వినవు కాలునిలువదు పల్లేలే మనసేదేఖ్
తరువు పరువు తరుణకాంతి తామరపై నీరునేలే
సుశీల రఫీ లత ఘంటసాల గొంతులే పాడే చోట
మాటొక్కటి తొక్కులాడే నేనులేక ఊరు పరంపర
ఫ్రీడమ్ అంతా ఊరైతే విజ్డమ్ పెంచేదే ఓవిజన్
జీవికి రావడం పోవడం ఆకలి నా మనుగడ ఊరే
భూమ్మీద గోలంతా మనిషే ఫాషన్ నో పల్లే ఇష్టం
కలలు కనేది కలతపడేది మనిషి ఊరే కలిమీలేమీ
తులసి తోట వాసన ఆరోగ్యం పల్లెఇంటి వంటసిరి
ఆటలు నడవవు మాటే ప్రాణం నన్ను సాకిన పల్లె
గాలిలో గాలి కలలో కళ మట్టిపాత్రల నీరేదూప
చూడచక్కని అందం నింగినేల విరిసే గొప్ప ఊరు
======================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి