ఊరుగాలి ఈల 86:- డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఆటపాటల బతుకు ఇచ్చే నాకు ఎద గుండె ఊరు
తాతల ముద్దు చెట్టునీడ వేళ్ళ నిగ్రానీలో గుడిసె 
దూరంలో తీరని పనిలున్న చెమట చేరే నన్నే పల్లె

అక్కడ వలసజీవి గలగల ఇక్కడ ఇల్లు గిలగిలబ్రో 
పల్లెఊయల ఊగే నింగికై వేసినబ్రిడ్జ్ తెగ కథెంటో
సంకల్పం సున్న సందేశం నిల్ మేఘం నిద్రఫుల్ లే

పరుగు వంకర తెగువ టింకర పిల్లలే నేర్పేక్రీడ పల్లె
తొక్కుడాట దొంగాట ఆడే ఊరు గుండెల గుండెనే
నన్నే చాసే రెప్పలు మూయవు బాటబాధ తెల్వదే

అందం నాదికాదు పల్లెసీమదే రాగం కూడా నే శిల
బాణీలు లేవు శ్రుతి నో జోరే గొంతు పల్లే ఓకోయిల
నా పేరే ఊరు నా బతుకే పల్లెమట్టి తొవ్వ జీవినేనే

అపరాలు పరంపరం నోరు కమ్మన సత్తిపిండి పల్లె
చెవుల దుద్దులు కొంగంచు పూలు సిగల  పల్లె ట్రీ
ఆకురాలిందా పాపం అందం అడవి కాచే చెట్టేపల్లె

అందం నెత్తిన పూలచెట్టు వేళ్ళే భూమి నవ్వే పల్లె
దారి ముగ్ధమోహనం నడక పోరే రక్తసింధూరంపా
అవని గీతదాట మనిషి చేట ఊపే చౌరస్తా పల్లెదా

తప్పెట తాళం పల్లెసీమ చీమలబారే ఆశ మాటనో
ఆకలి పిలిచే ఆశ అమ్మ గంజి ముంత తెరిచే పల్లె
జగమెరిగిన పల్లెదే జనపదం జానతనం డ్రైఎడారి

================================
(ఇంకా ఉంది)

కామెంట్‌లు