*సెల్లు ఫోన్ మహిమ*:- బౌగోళ్ల చైత్ర -9వ, తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల -జిల్లా సిద్దిపేట-9704865816.
 నాగరాజు కేమో హైదరాబాద్ లో రైల్వే ఉద్యోగం.
నళిని కేమో  రీల్స్ షూటింగ్ లో పాల్గొనడం.వీళ్ల ఇద్దరికి ఎప్పుడు తీరిక ఉండేదికాదు.
చిన్న కుటుంబం కాబట్టి కూతురు విమలను పట్టించుకునే వారు కాదు.
కూతురుకు సెల్ ఫోను లో వీడియోలు పెట్టించి వాళ్లమ్మ ఇంట్లోపని చేసుకునేది.త్వరత్వరగా పనులు పూర్తిచేసుకొనేది.
కూతురును ఆటోలో స్కూల్ కు పంపేది.ఎవరి పనులకు వారు వెళ్లేవారు.
కూతురు చదువు విషయాలను పట్టించు కోకపోవడంవలన తరగతిలో వెనుక బడిపోయింది.ప్రతిరోజు
ఇంటికి రాగానే సెల్లుకే అంకితమైపోయేది.
కొన్నిరోజులకు కూతురుకు విపరీతమైన తలనొప్పి,కళ్లుమండడం,కంట్లో నీరుకారడం, జ్వరం రావడం జరిగింది.
వెంటనే కూతురు విమలను డాక్టర్ వద్దకుతీసుకవెళ్లారు.
ఇదంతా సెల్లు ఫోను చూడడం వలన అనారోగ్యంపాలైందని డాక్టర్ తేల్చి చెప్పాడు.
సెల్లు బందుచేయక పోతే పిచ్చివాళ్లుగా మారే అవకాశం ఉంది.అందుకని జాగ్రత్తలు వహించుమని డాక్టర్ కళ్లజోడు,మందులు ఇచ్చి పంపాడు.
ఇంటికి వచ్చిన తర్వాత తమ తప్పును తెలుసుకొని భార్యాభర్తలు ఆలోచనలో పడ్డారు.
కూతురు జీవితంకంటే మనకేమి ముఖ్యంకాదని గ్రహించారు.భర్త సంపాదనతో కుటుంబజీవనం గడపవచ్చని నిర్ణయించుకున్నారు.
భార్య నళిని రీల్స్ షూటింగ్స్ బందు చేసి కూతురును దగ్గరుండి చూసుకున్నది.
క్రమక్రమంగా కూతురులో మార్పువచ్చింది.పదవ తరగతిలో 10 జీపీఏ సాధించింది.తల్లితండ్రులకు పట్టరాని సంతోషంకలిగింది.
సెల్లును అతిగా చూడడం వలన అనేక నష్టాలున్నాయనీ తెలుసుకున్నారు.



కామెంట్‌లు