ఒక అడవిలో నాలుగు అమాయకమైన కుందేళ్ళు వుండేవి. అక్కడ ఒక సోమరి కోతి వుండేది. ఆ కోతి ఈ కుందేళ్ళని చూసింది. వాటిని ఎలాగైనా భయపడించి అవి తెచ్చుకున్నవన్నీ హాయిగా తినాలని అనుకుంది.
ఒకరోజు ఆ కుందేళ్ళు పళ్ళు తెచ్చుకోని తింటావుంటే వురుక్కుంటా వచ్చి ''అల్లుళ్లు... అల్లుళ్లు... వాటిని తినొద్దు. అవి తింటే చచ్చిపోతారు. అడవిలో పళ్ళన్నీ బాగా విషపూరితమై పోయాయి. దేనిలో విషముందో దేనిలో లేదో తెలీదు. పోయిన నెలనే మా బంధువులు పదిమంది చచ్చిపోయారు. కానీ... నాకు ఒక ముని ఈ ఔషధాలున్న మొక్క ఇచ్చాడు. పొరపాటున ఏదైనా విషంది తిన్నా... వెంటనే ఈ మొక్క ఆకు ఒకటి తింటే చాలు... నాకు ఏమీ కాదు'' అంది.
కుందేళ్ళు భయపడ్డాయి. ఒక పక్క ఆకలి, మరోపక్క భయం. అప్పుడు కోతి ''సరే... మీరంతా చాలా మంచివాళ్ళు. మీకోసం ఒక సహాయం చేసి పెడతా. మీరు ఏం తెచ్చినా ముందు సగం నాకు పెట్టండి. అవి తిన్నాక నాకు ఏమీ కాకపోతే మీరు తినండి. నాకేమన్నా అయినా ఈ మొక్క నన్ను కాపాడుతుంది'' అంది. కుందేళ్ళు చానా సంబరపడ్డాయి.
ఆరోజు నుంచీ అడవిలో దొరికేవన్నీ తెచ్చి దానికి సగం పెట్టేవి. అవి బాగా తింటా కోతి బాగా నున్నగా బలిసింది. అప్పుడప్పుడు తింటా తింటా కిందపడి గిలగిలా కొట్టుకుంటున్నట్టు నటించేది. ఒక ఆకు తెంపి నలిపి నోటిలో వేసుకొని కాసేపటికి పైకి లేచేది. దాంతో కుందేళ్ళు బాగా భయపడేవి.
ఒకరోజు చెట్టు మీద చిలుక ఇదంతా చూసింది. కోతి వెళ్ళిపోయిన తరువాత కుందేళ్ళను విషయం అడిగింది. అవి చెప్పింది విని పడీపడీ నవ్వింది. ''ఓరినీ... మీమీద బండపడ. మరీ ఇంత అమాయకంగా వుంటే ఈ లోకంలో ఎలా బతుకుతారు'' అంటూ ఏం చేయాలో చెప్పింది.
తరువాత రోజు కుందేళ్ళు అరటిపళ్ళు తెచ్చాయి. అవి తిన్న కాసేపటికే కోతికి విపరీతమైన కడుపునొప్పి వచ్చేసింది. అమ్మా అబ్బా అంటూ కిందామీదా పడతా నొప్పితో విలవిలలాడసాగింది. అప్పుడా కుందేళ్ళు ''కోతి మామా... మేమే కావాలని వాటిలో కొంచం విషం కలిపి తెచ్చాం. నీ దగ్గర ఔషధాల మొక్క వుంది గదా... ఒక ఆకు తిను. వెంటనే తగ్గిపోతుంది. ఈ చిలుక నీకు ముని ఇచ్చిన మొక్క గురించి చెబితే నమ్మలేదు. అందుకే దీనికి బుద్ధి రావడం కోసం ఇలా చేశాం'' అన్నాయి.
కోతి అదిరిపడింది. ''అయ్యో... ఎంత పని చేశారు. మీకు అబద్ధం చెప్పి ఇన్ని రోజులూ మోసం చేశాను. నా దగ్గర ఏ మాయా లేదు. ఏ మొక్కా లేదు. అంతా వుత్తుత్తిదే'' అనింది. అప్పుడు కుందేళ్ళు మరో పండు దానికి ఇచ్చి ''నీ కడుపు నొప్పికి విరుగుడు మందు ఇందులో వుంది తిను. నువ్వు మా నలుగురినీ మోసం చేసినా మేం నిన్ను చంపేంత చెడ్డవాళ్ళం కాదు'' అన్నాయి. కోతి బెరబెరా ఆ పండు తినింది. కాసేపటికి అది మామూలుగా అయిపోయింది.
''అయ్యో... అల్లుళ్ళు... మీరు ఎంత మంచివాళ్ళు. నన్ను కాపాడారు. ఇకపై ఎవరినీ మోసం చేయను'' అంటూ అడవిలోకి పోయింది. మంచి మంచి తీయతీయని పళ్ళు తీసుకువచ్చి వద్దువద్దంటున్నా వినకుండా కుందేళ్ళకు పెట్టింది. అప్పటినుంచీ అవన్నీ కలసిమెలసి హాయిగా బతకసాగాయి.
***********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి