31.నలుపై మెరుపై జనాల, మనసే మురిపించావే!గెలుపు దిశ నడిపి,పార్థుడ్ని విజయుడ్నే చేసావే!నన్ను వెన్నంటి వేటాడే, కష్టాలన్నీ తెలిసినవాడవే!మౌనం వీడి జీవనరథం ,ఆ దరి నీవే చేర్చరావే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!32.ఒకరి రక్షణ ఉరుకుల,పరుగుల వచ్చినావే!మరొకడ్ని పరీక్షలన్నింట ,నీవే గెలిపించావే!ఆమె ఆర్తితో పిలిస్తే,మరి మానమే కాపాడినావే!నేనూ నీ వాడనే చేకొన ,మాటతప్పక. దిగిరావే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా !33.కరుణాలవాలా, కమలనేత్రా, మనోభీష్ట ప్రదాత!నావంటి వారిని ఆదుకో,చూపు రవ్వంత ఆతురత!ఆర్తులపాలిట ఆపద్బాంధవ,ఆకళంక చరిత!అదిదేవా, మరో అవతారమై,కరుణించు కాసింత!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి