55.బతుకు బియ్యపు గింజే,కాలతిరగలి నలగంగ!బతుకు కన్నీళ్ళ ,తడిసిన బట్టే ఆరదు వేగంగ!ఎంత పిండినా తడి,ఆరదే ఆగక నీరే కారంగ!మా పెదవి విడదే ,నోరు పెగలదే మాటలాడంగ!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!56.ఆడవారి మాటలకు,అర్ధాలే వేరులే కవిమాటే!అందరి మాటలు వినగా,ద్వంద్వార్థాలే జనాల నోటే!బాగున్నావా?క్షేమంకోరడమా,సందేహమే ప్రతి పూటే!బాగు చూసి ఓర్వలేకే ,ఏడుస్తూ ఉంటారే నోటి తోటే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!57.అవసరం అవకాశం ,అనుక్షణం వాడుకోవడమే!పరుల నిరంతరం ,వీలైనంతగా దోచుకోవడమే!మనిషినీ వస్తువే చేసి,వాడుకొని పారేయడమే!చెప్పేవి నీతులే ,కొంగలైదొంగ జపాలే చేయడమే!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి