67.ఆకలి దారిద్ర్యం దంపతులే, సంతానం అష్ట కష్టాలే!ఆకలిఒడి, దారిద్రమడి, తిరుగులేని శాపాలే!దినం దినం కృంగి కృశించే, కష్టజీవుల జీవితాలే!భూమధ్యరేఖ పైనా?దారిద్రరేఖ దిగువ చూడాలే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!68.ఆకలి తీరని మనిషే,ఆ క్షణాన మృగమౌతాడే!పేదరిక పీడనతో,అవినీతి తాళమే తీస్తాడే!అవసరాలకేమన్నా ?సగటు మనిషి అతీతుడే!జితేంద్రియుడూ ఒక్కోసారి,అవుతాడే పరాజితుడే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!69.ఆకలి తీరక దారిద్ర సంకెళ్ళ, బందీలైన వారే!సంఘవిద్రోహులై పరోక్షంగా, సమాజాన్ని శాసిస్తారే!వారేగా ఒక్కోసారి ,నాయకులై, పాలకులవుతారే!ప్రజాస్వామ్యం, పెడచెవిన, పెట్టే నియంతలవుతారే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి