ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
76.
నిత్యశ్రమ టెక్నిక్ తెచ్చే బ్లాంక్, 
చెక్కే లక్కే అవదా?

తిని కూర్చోకుండా, శ్రమిస్తే, తిన్నది బలమే కావదా?

పని ఒక్కటే మూసిన,
 మనీ తలుపులు తెరవదా? 

వేదం జ్ఞానగడి తీయ, స్వేదం,
 సుఖసేద్యమే చేయదా? 

ఆవేదనే నివేదన ఆలకించు,    
     మా సింహాచలేశా!
77.
అడుక్కోవడం అతి సులువే, వార్ని పని మళ్ళించండి!

పని బడి ,బతుకు రాబడి, తెస్తుందని నమ్మించండి! 

ధర్మం పేరు పెట్టి కొందర్ని ,
    ఉరకనే పోషించకండి!

జీవన సత్యమే శ్రమేగా,
జనం కళ్ళు తెరిపించండి!

ఆవేదనే నివేదన ఆలకించు, 
   మా సింహాచలేశా!
78.
పని మీదనే దృష్టి ,
ఆత్మవిశ్వాస పుష్టే పెరగాలి!

పరులు విదిల్చే పరమాన్న, పాకులాట వదలాలి!

స్వశక్తే గంజే తాగినా,
 మనిషి తృప్తిగా బతకాలి! 

దేశమనే దొడ్డవృక్షం,
 నరుల చెమట తడవాలి!

ఆవేదనే నివేదన ఆలకించు, 
  మా సింహాచలేశా!
_________


కామెంట్‌లు