ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
58.
భక్తి పేరుకే, పెరిగేవన్నీ,
పెక్కు బాహ్యడంబరాలే!

తీర్థయాత్రల పేరుతో,
 చేసేవన్నీ విహారయాత్రలే! 

కోవెల సేవలు సైతమూ,
  వెలతో వచ్చే వైభోగాలే!

ఆధ్యాత్మికం పరమార్థికం, 
తెరచునా  దైవద్వారాలే!

ఆవేదనే నివేదన ఆలకించు, 
మా సింహాచలేశా!
59.
మనిషి మార్గమేదైనా,
 తనకు తానే బతుకుతాడే! 

సొంత మనిషినోటే,
మట్టే గొట్టి అదే నీతి అంటాడే!

తన గీత పెంచుకోడే, ఇసుమంతైనా ప్రయత్నించడే! 

పక్కవాడి గీత తానే వ్రాసి, చెబుతా వినమంటాడే!

ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!
60.
నేడు మనిషి ఊపిరాడదు,
 దహించే దురాశ ఘాటే!

మరి తప్పదు తలపోటే ,
వేచి ఉండేది సరివేటే!

బంగారుబాతు కథే ,
విన్నవాడికే రాదు గుండెపోటే!

దురాశ దుఃఖ తెరచాటే,
 తీసావో  పెద్ద పొరపాటే!

ఆవేదమే నివేదన ఆలకించు, 
  మా సింహాచలేశా!
_______


కామెంట్‌లు