ప్రదక్షిణం అంతరార్థం: - గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
"ప్రదక్షిణం" అను పదములో " ప్ర" అక్షరము పాపాలకు నాశనము.
" ద" అనగా కోరుకున్న కోరికలను తీర్చమని," క్షి " అన్న అక్షరము మరుజన్మ అనేది ఉంటే ఆ జన్మలో మంచి జన్మ ఇవ్వమని," ణ "అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని, దేవాలయములో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత పింగాణీ అర్థం పరమార్థం దాగి ఉంది. పూర్వకాలంలో ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసి ఫలం పొందాడు. కావున మనం భగవంతుని చుట్టూ చేసే ప్రదిక్షిణ విశ్వ ప్రదిక్షిణం అవుతుంది . ఆత్మ ప్రదక్షిణ అని కూడా అంటారు. భగవంతుడా! నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. 
     ఏ గుడికి ఎప్పుడు వెళ్లాలి ?
    ((((((((&&&&&))))))))))))
ఉదయాన్నే శ్రీమహావిష్ణు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్లడం శుభప్రదం. శ్రీమహావిష్ణువు స్థితికారకుడు. కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం మనకు వచ్చే సమస్యలను తొలగిస్తాడు . మన బుద్ధి ద్వారా ఆపదలను తాను తొలగించి మనల్ని ఎల్లవేళలా సుఖంగా ఉండేటట్టు చూస్తాడు.
    పరమేశ్వరుడు లయకారకుడు. కావున రోజు పూర్తవుతున్న సమయంలో దర్శిస్తే మనకు ఆయన రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని మనం దర్శించాలి.

కామెంట్‌లు