కిడ్డీ బ్యాంకు చిరుతలం
వడ్డీ ర్యాంకు బుడతలం
బ్యాంకు సేవలు అర్థిస్తాం
ర్యాంకు తోవలు గుర్తిస్తాం !
బ్యాంకు వారిని కలుసుకుంటం
పొదుపుదారులు తెలుసుకుంటం
చిరు వ్యాపారాలను చేస్తుంటం
మాఖాతాలో సొమ్మును వేస్తుంటం
చిన్న మొత్తాల ఖాతాను తెరుస్తాం
ఉన్న విత్తమంత వేసేసి మెరుస్తాం
వచ్చే వడ్డీతో అప్పులను తీరుస్తాం
అప్పుముప్పుల జాకీని మారుస్తాం
జబ్బులతో మా ఆరోగ్యం చెడకుండా
డబ్బులతో మేము ఇబ్బంది పడకుండా
ఉండాలంటే ఇక మునుముందు
చేస్తుంటాం మాపొదుపుల విందు
పొదుపులో గండి పడకుండా శ్రమిస్తాం
అదుపులో ఉండి మేము విశ్రమిస్తాం
మా మదుపు దారిలోన పయనిస్తాం
కుదుపులేని మా కునుకుతోని శయనిస్తాం !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి