రాజ్యాంగం మన కరదీపిక:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ-9640748497
 ప్రపంచంలోనే 
అత్యంతపెద్ద ప్రజాస్వామ్య
  దేశం మనది.
అతిపెద్ద లిఖిత రాజ్యాంగము మనది.
పాలకుల స్వార్థపరత్వంతో
అమలుకు నోచుకోని
రాజ్యాంగ నియమావళి మనది.
ప్రజలకుపాశుపతాస్త్రమంటి రాజ్యాంగం 
అంబేద్కర్ మన చేతికందించినా ప్రగతికి
 నోచుకోని బడుగు బలహీనులంమనం.
పాలకుల స్వప్రయోజనార్థం రాజ్యాంగం అమలుకు నోచుకోని వైనం.
నిమ్న జాతులకు నిలువ నీడ కరువు,
అడుగడుగునా ప్రాథమిక హక్కులు కాలరాయబడుతున్నవిధానం.
ప్రజలచేత ,ప్రజలకొరకు, ఏర్పడ్డప్రజాస్వామ్యవ్యవస్థ
పాలకుల చేత,పాలకుల కొరకు, ఏర్పడ్డ
కార్పోరేట్ వ్యవస్థగా మారిన వైనం,
దిక్కుతోచని స్థితిలో జనబాహుళ్యం.
ప్రశ్నించే హక్కులేక
మూగనోముపట్టిన బడుగుల దైన్యం.
ప్రజలే పాలకులన్నదేడుంది?!
ఆచరణసాధ్యం కానప్పుడు !?
రాజ్యాంగ మూల సూత్రాలకు
విలువేముంది?!
అమలుకు నోచుకోనప్పుడు!?
ఏలికల ఏకస్వామ్యం విధానం !
రాచరికపు పోకడను తలపిస్తుంటే ?!
రాజ్యాంగం 
అసమర్థ  పాలకులమూలంగా విలువలేనిదవుతుంటే?!
దేశప్రజల సర్వతోముఖాభివృద్ధికై వ్రాసుకున్న రాజ్యాంగం ,
పాలకుల
స్వయం సమృద్ధికోసమైనవైనం.
ఏలికలు ఈ రీతిగా ఉంటే!?
ప్రజలు నిస్తేజంగా ఉంటే!?
సమధర్మం!
సమన్యాయం!!
సమసమాజం!!!
 ఎప్పటికీ ఏర్పడేది?!
ఇకనైనా మేల్కొందాం!!
మహనీయుడు భారతరత్నడాక్టర్ భీంరావ్ రాంజీ  అంబేద్కర్ 
వ్రాసిన రాజ్యాంగాన్ని తూచతప్పకుండా అమలు చేయాలని 
ఆ రాజ్యాంగ ఫలాలను దళితులు, గిరిజనులు, ఆదివాసీలు  
బహుజనులంతా అందిపుచ్చుకునేలా... 
తోడ్పాటునందించాలని 
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనుడిమాండ్ చేద్దాం!!
దసరా దీపావళి ఉత్సవాలవలే
రాజ్యాంగ దినోత్సవాన్ని దేశమంతా నిర్వహిద్దాం!
రాజ్యాంగం గూర్చి విస్తృతంగా 
దేశమంతా ప్రచారం చేయుటకై
రాజ్యాంగ వారోత్సవాలు ప్రారంభిద్దాం!
అంబేడ్కర్ వ్రాసిన రాజ్యాంగం 
అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి
ఎలా తోడ్పడుతుందో?!
 ప్రచారప్రసార సాధనాల ద్వారా 
విరివిగా ప్రచారం చేద్దాం!!
బుద్ధం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం.
రాజ్యాంగం గూర్చి ప్రతీ ఒక్కరం తెలుసుకుందాం.


కామెంట్‌లు