అనగనగా చంద్రాపురం అనే గ్రామంలో శారద అనే ముసలావిడ ఉండేది. శారద మనుమరాలు కావ్య. కావ్యకు నానమ్మా అంటే చాలా ఇష్టం. కావ్యకు నానమ్మ ప్రతిరోజు ఒక కథ చెప్పేది. కానీ కావ్య మాత్రం కథలు వినేది కాదు పెడచెవిన పెట్టేది. అయినా శారద మాత్రం మనమరాలుకి కథలు చెప్తుండేది.
ఒకరోజు మనుమరాలు కావ్యను పిలిచి నానమ్మ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పమంటుంది. ఓస్ అదెంత చెప్పేస్తానని కావ్య అంటుంది. ఈ ప్రపంచంలో దేనిని చూస్తే మనుషులు మారుతారని మొదటి ప్రశ్న నానన్మ అడుగుతుంది. కావ్య ఠక్కున బంగారమని సమాధానం చెబుతుంది. నానమ్మ నవ్వుతూ ఎదుటి వ్యక్తుల స్వభావం మంచిగా ఉంటే మనుషులు మారుతారంటుంది.
మళ్లీ నానమ్మ రెండో ప్రశ్న అడుగుతూ ప్రపంచంలో విలువైనది ఏది అంటుంది. అప్పుడు కావ్య బాగా ఆలోచించి మళ్ళీ బంగారం అని సమాధానం ఇస్తుంది. నానమ్మ కావ్యను మొట్టికాయ వేస్తూ మనుషులకు గుణం విలువైనది. మంచి గుణం ద్వారా ఏదైనా సంపాదించవచ్చు అందులో బంగారం ఎంత అని అంటుంది. నానమ్మ ఇవన్నీ మేము చదువుకునే పుస్తకాలవో లేవు కదా అని కావ్య ప్రశ్నిస్తుంది. బంగారు తల్లి ఇవన్నీ నీతి కథల ద్వారా తెలుస్తుందని నానమ్మ చెప్పడంతో ప్రతిరోజు కావ్య నానమ్మ వద్ద నేర్చుకున్న కథలతో జీవిత సత్యాలు గ్రహించసాగింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి