అక్షర ప్రబోధ గీతి:- --గద్వాల సోమన్న ,9966414580
ధైర్యాన్ని నింపుకొని
సింహంలా జీవించు
నమ్మకాన్ని పెంచుకొని
పక్షి వోలె విహరించు

పిరికితనము వదులుకొని
వీరునిలా కన్పించు
స్వయం కృషిని నమ్ముకొని
ప్రగతి బాట పయనించు

నిరంతర సాధనతో
విజయాలు సాధించు
సడలని పట్టుదలతో
లక్ష్యాన్ని ఛేదించు

చరిత్రలో నీ కోసము
ఒక పుట

కేటాయించు
దానికై అహర్నిశలు
పోరాటం సాగించు

కన్నవారి కలలను
సాకారం గావించు
గురుదేవుల ఆశలను
ఖచ్చితంగా బ్రతికించు

కామెంట్‌లు