వాస్తవాల వెలుగులు:- --గద్వాల సోమన్న ,9966414580
మది నిండా ధైర్యము
శిఖరమంత సహనము
కలిగియున్న బ్రతుకున
చేకూరును విజయము

పసి పిల్లల తత్వము
మేలిమి బంగారము
చేయదు ఆపకారము
దైవానికి ఇష్టము

కష్టించే తత్వము
చేయునోయ్! సాహసము
సాధించును ఫలితము
అందించు గౌరవము

హృదయమే కోమలము
భగవంతుని నిలయము
కాకూడదు కఠినము
చేయరాదు మలినము


కామెంట్‌లు