నేటికవనాలు సమాలోచనలు :- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కవితలు
కుప్పలతెప్పలుగా వెలువడుతున్నాయి 
కవులు
ఇబ్బడిముబ్బడిగా పుట్టకొస్తున్నారు

పత్రికలు
పెక్కురాతలను ప్రచురిస్తున్నాయి
కవులకుబిరుదులు
వివిధసంస్థలు ఇస్తున్నాయి

కవిసమ్మేళనాలు
పలుప్రదేశాలలో జరుగుతున్నాయి
కవిసన్మానాలు
విరివిగా జరుగుతున్నాయి

యువకవులు
రోజురోజూ పెరుగుతున్నారు
మహిళాకవులు
పెద్దసంఖ్యలో ప్రవేశిస్తున్నారు

కవితలలో
తాళులేకుండా ధాన్యముండెలాచూడాలి
కవనాలలో
ఓడువిలేకుండా గట్టివియుండేలాచూడాలి

కైతలలో
పొట్టులేకుండా గింజలుండేలాచూడాలి
కయితలలో
వ్యర్ధాలులేకుండా అర్ధాలుండేలాచూడాలి

పుస్తకావిష్కరణలు
పలుచోట్లా చేయబడుతున్నాయి
కవితలకు
దిశయుండాలి మార్గనిర్దేశముండాలి

కయితలు
పాఠకులను ఆకట్టుకొనేలాగుండాలి
కవనాలు
చదువరులు ఙ్ఞాపకంపెట్టుకొనేలాగుండాలి

రాతలలో
నూతనత్వముండాలి వస్తువైవిధ్యముండాలి
అక్షరాలలో
కువకువలుండాలి కళకళలుండాలి

అప్పుడే
సాహిత్యానికి వృష్టి పరిపుష్టి
ఆనాడే
వాణీదేవికి హారతి ప్రఖ్యాతి


కామెంట్‌లు