తేనె తెచ్చిన తంట :- కే దిలీప్ పదవ తరగతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటిపాముల కట్టంగూరు మండల్, నల్లగొండ జిల్లా.
  అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు మదనపురం. ఆ ఊరిలో ఒక తేనే వ్యాపారి ఉండేవాడు అతని పేరు సోమేశ్, అతడు తేనెలో చక్కెర కలిపి కల్తీ చేసేవాడు ఆ తేనెను మదనపురం ప్రజలకు అమ్మేవాడు,  అంతే కాదు అతను తేనెను రసాయన పద్ధతిలో తయారుచేసి అమ్ముతుండేవాడు. ఒకరోజు పెద్ద ధనవంతుడు తన పేరు ముఖేష్, తన కూతురు పెళ్లికి ఐదు కేజీల తేనె కావాలని సోమేశ్ దగ్గరకు వెళ్లి అడిగాడు, స్వామి దగ్గర ఉన్నటువంటి తేనెను ఇచ్చాడు,   అది తీసుకొని  ధనవంతుడైన ముఖేష్ తన కూతురు పెళ్లి కి చేసే పిండి వంటలలో కలిపి చేయమని చెప్పాడు. పెళ్లి రోజు రానే వచ్చింది.  ఆ పిండి వంట లు చేసిన తర్వాత పెళ్లికి వచ్చిన వారందరికీ అవి వడ్డించారు, ఆ పిండి వంటలు తిన్న జనులంతా మరణించారు. దీనికి కారణం ఏందని తెలుసుకోగా పిండి వంటల కోసం ఉపయోగించిన తేనెలో రసాయనాలు ఉన్నాయని కల్తీ విహార పదార్థాలను కనిపెట్టే ఆఫీసర్ల ద్వారా  తెలిసింది. అప్పుడు వెంటనే పోలీసులు వచ్చి తేనే వ్యాపారి సోమేశ్ ను అరెస్టు చేశారు. తర్వాత అతన్ని కోర్టులో విచారించి అతనికి ఉరి శిక్ష వేశారు. అందువలన మనం లాభం కోసం చూస్తే,  ఇతరుల ప్రాణం ఇరకాటంలో పడుతుంది. నీతి గా ఉంటే మనం మంచి వారంగా పేరు తెచ్చుకోవచ్చు, ఇలా చేస్తే ఎప్పుడో ఒకసారి మన  ప్రాణానికి కూడా ప్రమాదం జరగవచ్చు, మనవారికి కూడా ఆపద రావచ్చు. 

నీతి :- మన స్వార్థం కోసం మనం  చెడు చేస్తే, ఇతరులతో పాటు కూడా మనకు నష్టం జరుగుతుంది.

           

కామెంట్‌లు