అక్షరకౌముది సామాజిక, సాంస్కృతిక,సాహిత్య జాతీయ సేవా సంస్థ పంచమ వార్షికోత్సవ సందర్భంగా కవి ,రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ రసాయనశాస్త్ర విశ్రాంత శాఖాధిపతి విశాఖపట్నం ను గౌరవ అతిథిగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తులసి వెంకట రమణాచార్యులు,ప్రధాన కార్యదర్శి శ్రీమతి మూర్తి శ్రీదేవి ,సి.నా. రె .పురస్కార గ్రహీత కవి విమర్శకులు దాస్యం సేనాధి పతి, ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ ,కవియత్రి పోచం సుజాత,నాట్యాచార్యులు డాక్టర్ వట్టికోట యాదగిరి ఆచార్యులు,సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు శ్రీమతి నల్లమోతు రాణిగారు,వ్యాపారవేత్త, సామాజిక సేవకులు ముత్యాల తిరుపతి రెడ్డి గారి సమక్షంలో ముఖ్య అతిధి ప్రముఖ సాహితీవేత్త కేంద్ర సాహిత్య సలహామండలి సభ్యులు తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య నాళేశ్వరం శంకరంగారి స్వహస్తాలతో దుశ్శాలువ, మొమెంటోతో భాగ్యనగరంలోని ఏ.ఎస్ రావు నగర్ సంక్షేమ సాంస్కృతిక గ్రంథాలయ ప్రాంగణంలో ఘనంగా సత్కరించారు. బదులుగా ప్రసాద్ మాష్టారు భీష్మ ఏకాదశి పర్వదినాన సాహితీమూర్తులచే సత్కరించబడటం చాలా సంతోషంగా ఉందని మరువలేనిదని తెలియచేసారు.
.................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి