సాహిత్య రంగంలో విద్యార్థులు ముందు వరుసలో నిలవాలని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దిశగా సృజనాత్మక ఆలోచనలు విద్యార్థులలో పెంపొందాలని నకిరేకల్ నియోజకవర్గ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ప్రముఖ రచయిత్రి, ఉపాధ్యాయిని డాక్టర్ ఉప్పల పద్మ సంపాదకత్వంలో ప్రచురించబడిన మంత్రదండం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వేముల వీరేశం గారు పాల్గొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుండ్రాంపల్లి విద్యార్థులు రచించిన మంత్రదండం కథల సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా రచయిత్రిగా, ఉపాధ్యాయినిగా ఉప్పల పద్మ చేస్తున్న కృషిని అభినందించారు. విద్యార్థులు రచించిన కథలను చదివి వారి ప్రతిభను ప్రశంసించారు. ఖచ్చితంగా గుండ్రాంపల్లి పాఠశాలను సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాపకులు డాక్టర్ సాదం ఐలయ్య, ఎస్.సి.ఇ.ఆర్.టి ఫ్యాకల్టీ పఠాన్ ఎఫ్ .ఖాన్, పల్లెర్ల సురేందర్ లు, చిలుకూరి మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. వెంకట్ రెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది ఈ విధంగా విద్యార్థులచే కథలు రాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం పెంపొందాలి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి