చిత్ర స్పందన : -ఉండ్రాళ్ళ రాజేశం

 మత్తకోకిల

బాలలంతయు సాగుతుండగ బాటలందున నిల్చియూ
బాల తేజులు వీధులందున వంగి చెత్తలు మోయగా
కాలమందున వింత దృశ్యము కాంచినంతయు హృద్యమౌ
బాలలందరు విద్యలందున బాటపట్టిన సంబ్రమౌ


కామెంట్‌లు