అక్షరాలతో -
ఆడుకున్నట్టే ,
నువ్వు మనసులతో
భలే ఆడుకుంటావు !!
----------------------------
నీ సంతోషానికి
సహకరించే సంఘటనలు ,
ఇతరుల దుఃఖానికి
హేతువు కాకూడదు సుమా....!!
-------------------------------------------
పొగడ్తలకు నువ్వు
మరీపొంగిపోతావు!
వెనక వెటకారపు నవ్వులు
నీకు అర్ధం కానేకావు....!!
-----------------------------------
మంచి-చెడ్డలు
వివరించడం నావిధి!
తప్పుగా అర్ధం చేసుకుంటే
ఖచ్చితంగా అది నీ ఖర్మం....!!
------------------------------------------
పైపై మెరుగులు చూసి
మోసపోతే ఎలా?
నమ్మకాన్ని రూఢీ చేసుకోకుండా
అడుగుముందుకేయడం తగునా!!
------------------------------------------------
స్థిరత్వంలేనిమనసుతో
ఆలోచించటం .....
మొదలుచెడ్డబేరం !
ముందది గ్రహించడం మేలు !!
----------------------------------------------------
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి