తెల్సుకుందాం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

 రామాయణకాలంలోనే కరచాలనం హస్త పీడనం ఉంది.అంటే షేక్ హాండ్ ఫారిన్ నుంచి దిగుమతి కాలేదు.రామసుగ్రీవులు  హనుమ అంగదుడు కుడిచేత్తో తాకటం రామాయణంలో ఉంది.రోమపాదుడు దశరథుడు చేతులు కల్పటం వీడ్కోలు పలకటం జరిగింది.కానీ మురికిచేతుల్తో  అంటురోగాలొస్తాయి. కాబట్టి చేతులు జోడించి నమస్తే అంటం బెస్ట్!ఆధ్యాత్మ రామాయణం బ్రహ్మాండ పురాణంలో ఉంది.వ్యాసుడు రాశాడు.రాముడు దేవునిగా చిత్రింపబడ్డాడు.సీత మాయసీతగా రావణుడి వెంట వెళ్లింది.తన నిజరూపాన్ని అగ్నిలో దాచింది. రావణుడి నాభిలో అమృత భాండం ఉందని చెప్పబడింది. రాముని చేతిలో చావాలనే రావణుడు యుద్ధం చేశాడు.శివ పార్వతులు మర్కటరూపంలో క్రీడిస్తే హనుమంతుడు పుట్టాడు.అద్భుత రామాయణం క్రీ.శ.1600లో రాయబడింది.ఇందులో 26సర్గలున్నాయి.సీతారాములు నారదుని శాపంవల్ల అవతారమెత్తారు. సీత  మండోదరి కూతురని రాముని కన్నీరు వైతరిణీ నదిగా మారిందని  ఇలా చిత్రాతిచిత్రంగా సాగింది🌹
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం