పుస్తకాల విశేషాలు4 సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

 ఈసప్స్ ఫేబుల్స్ చిన్న గా ముచ్చట గా నీతిని బోధిస్తాయి. క్రీ.పూ.620లో గ్రీక్ బానిస  ఈసప్ చెప్పిన కథలు నేటికీ అజరామరం.మన పంచతంత్రకథలలాగా జంతువులే ప్రధాన పాత్రలు.ఆయన ప్రతిభ తో బానిసత్వం నుంచి విముక్తుడైనాడు. శతాబ్దాలపాటు జనాలు అలా చెప్పుకుంటూ వచ్చిన ఆకథలు క్రీ.పూ.300లో వ్రాయబడి లాటిన్ లోకి అనువాదం ఐనాయి.రోమన్ పండితుల ప్రశంసలందాయి.ఫాదర్ ఆఫ్ హిస్టరీ గా ప్రసిద్ధుడు హెరొడొటస్. టర్కీ లో క్రీ.పూ.5వశతాబ్దిలో నివసించిన ఆయన గ్రీక్ పర్షియన్ యుద్ధాల గూర్చిరాశాడు.ఆయన లక్ష్యం ఆనాటి పరిస్థితులు రాజకీయ విషయాలను రాయటమే. యూరప్ ఆసియాల మధ్య యుద్ధాలు కారణాలు రాశాడు.గ్రీకుల్లో ఆనాటి మూఢనమ్మకాల గూర్చిన విషయాలు అన్నీ లోకానికి తెల్పటమే గాక చరిత్ర కారులకు మార్గదర్శి గా నిల్చాడు🌹
కామెంట్‌లు