బక్రిచెప్యాల బడిలో హనుమాన్ గుడి ఉన్నది.విశాలమైన ఆటస్థలంలో గుడిముందు బడిముందు మహావృక్షాలుగా పెరిగిన రావిచెట్లుఉన్నవి.గుబురుగా పెరిగిన రకరకాల చెట్లతో పాఠశాల కళకళలాడుతుంది. చెట్ల గాలి వలన నీడ వలన బడి పిల్లలు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉండి సార్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటున్నారు.ఇలా కొన్ని రోజులు గడిచాయి.ఒకసారి ఎక్కడినుండో కొంగల గుంపు అక్కడికి వచ్చింది.రావి చెట్టు మీద గూళ్ళు కట్టుకొని పిల్లాపాపలతో హాయిగా ఉంటున్నాయి.విచిత్రమేమిటి అంటే "హనుమాన్ గుడి ముందర రావి చెట్టు దగ్గర రాత్రిభజన చేసుకొనేవి.తిరిగి వచ్చి కొంగలన్ని కూడా బడిముందరి చెట్టు మీదనే నివాసము ఉండేవి.ఎందుకని ఆలోచిస్తే ఈ కొంగల గుంపు చదువు నేర్చుకుందామనె ఉద్దేశంతో ఈ చెట్టును నివాసంగా మార్చుకున్నాయి. కొంగలు రెట్టలు వేయడంతో పిల్లలకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. తల్లిదండ్రులు బాధపడుతున్నారు.పిల్లల తల్లిదండ్రులు ఆ చెట్టు కింద దీపావళి సుతిలి బాంబులు,కుక్కతోక పటాకులు తెచ్చికాలుస్తున్నారు. భయంకరమైన శబ్దాలకు పెద్దకొంగలు లేచిపోతున్నాయి.అప్పుడే రెక్కలు వచ్చిన చిన్నపిల్లలు భయానికి క్రిందపడుతున్నాయి.
మళ్లీ తల్లులు వచ్చి గూటిలోకి తీసుకపోతున్నాయి.చావైనా బ్రతుకైనా ఈ చెట్టుపైనే ఉంటామనుకున్నాయి.కొంత మంది పిల్లలు చెట్టు కింద కూర్చొని చదువుకుంటుండగా ఒక కొంగ పిల్లచనిపోయి వాళ్ల మధ్యలో పడింది.అయ్యో!పాపం మనం చేసే అల్లరికి చనిపోయిందేమోనని పిల్లలు బాధపడుతారు.ఒకరోజు పిల్లల దగ్గరికి కొంగరాజు వస్తాడు.దయచేసి చెట్టు కింద బాంబుల శబ్దాలు చేయవద్దని ప్రాధేయపడుతాడు.మీరు అడవిలోఉండక ఈ చెట్టుపైనే ఎందుకు నివాసముంటున్నారని పిల్లలందరు ప్రశ్నించారు.మీరన్నదినిజమే అడవుల ఉన్న చెట్లన్ని నరకడంవలన మా నివాసాలు ఊర్లకు మార్చుకున్నాము.అందుకే ఈ స్థలాన్ని ఎంచుకున్నాం.మా రెట్టవలన మీకు జబ్బులు వస్తున్నాయని మాకు తెలుసు. ఏమీచేయలేని పరిస్థితి.మీతో పాటు మేముకూడా సార్లుచెప్పే పాఠాలు వింటున్నాము.మీ సైన్స్ సారు పర్యావరణం గూర్చి చెప్పినప్పుడు వింటున్నాము.మీ రన్న మా గురించి ఆలోచించండి.మీరు, మీఊరివారు అందరుకలిసి ఎక్కడ ఖాళీ స్థలం ఉన్న అక్కడ మొక్కలు నాటండని కొంగరాజు చెప్పాడు. పిల్లలందరు కలిసి తల్లిదండ్రులను ఒప్పించి హరితహారంలో వేలాది మొక్కలను నాటారు.వాటిని సంరక్షించారు.అడవి పచ్చదనంతో కళకళలాడుతుంది.కొంగలన్నికూడా పిల్లలకు వీడ్కోలు చెప్పి వెళ్లిపోయాయి.ఈ కథవలన చెట్లు నరకవద్దనే నీతిని తెలుసు కున్నాము.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి