కనిపించవా కోయిల...:- ' కమనసాగర '-" కావ్యసుధ "-9247313488-హయత్ నగర్ -హైదరాబాదు
శిశిర ఋతువులో 
చెట్లన్నీ ఆకులు రాల్చి 
మ్రోడు  వారి పోతాయి 
వసంతాగమనంతో 
మరల చెట్లన్నీ చిగిర్చి 
ప్రకృతి కొత్త అందాలను
పులుముకుంటుంది.

తరువులు కొత్త చిగుళ్ళతో 
కోయిలమ్మ కుహు కుహు                             
రాగాలతో.... ఉగాది వసంత
శోభితమవుతుంది.

కోయిల ఉగాది పర్వదినాన 
నీ మధుర స్వరాలేవి..
ఉగాది పర్వదినాన 
వినిపించడమే లేదు
కనిపించడమే లేదు 
మీ చిరునామా ఎక్కడ !?



కామెంట్‌లు