115.బతుకు బాగా బతికించి,ఎంతో దూరం నడిపించావే!అందలాలెన్నో ఎక్కించావే, సహబాష్ అనిపించావే!ద్వంద్వాలకతీతుడా,నాబతుకు ద్వంద్వాలే,పాల్జేసావే!సరి దారి చూపించక ,కినుక వహించి దాగున్నావే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!116.చెవితో మాట వినలేనే,నోటితో మాట అనలేనే!చేతులెత్తి మొక్కలేనే,, కాళ్ల ఒక్క అడుగేయలేనే!నేల పడి ఉన్న నేను ,నీపై మనసే నిలపలేనే!అవయవాలు పరాధీనం,మాట వినని మేను మేనే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!117..నన్ను ఇల నా వాళ్లు, ఉండాలను కున్నన్నాళ్ళే,ఉండనీ!వాళ్లు యావగించుకునే ,దుస్థితి అసలు రాకుండనీ!చివరి శ్వాసలోనైనా,నీ దివ్య నామమే స్మరించనీ!ఆ స్థితిలోనే మృత్యు దేవత,కదిలొచ్చి వరించనీ!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన.;- డా పివిఎల్ సుబ్బారావు,-9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి