118.నా మొర విన్నావే కలలో,దర్శన భాగ్యమే ఇచ్చావే!కరగనికలే, తరగనికళే,ధన్యుడ్నే చేసావే!ఆప్యాయంగా, ఆత్మీయంగా, నన్ను నీ యెదపై చేర్చినావే!దీనబంధూ! దయతో,నాకిక ఏమీ, వద్దనిపించావే!స్వామీ! వేరేమీ కోరనే ,నా బతుకే సార్ధకం చేసావే!119.ఈ ఒక్క క్షణమే, సఫలమే,జీవన నిరీక్షణమే!నీ దర్శనమే చతుర్వేద,సంపూర్ణ అవగాహనమే!నా ఆవేదన ఆరాధన,నీవిచ్చిన మూల్యాంకనమే!తుదకిదే నరజన్మ,వాంఛితమే మహాసాఫల్యమే!దివ్యమూర్తీ! హృదయార్తి,విన్నావే సాష్టాంగ ప్రణామమే!120.నిరాకారా! ఆద్యాంత రహిత,విశ్వస్థిత చైతన్యమా!జగతి సృష్టి స్థితి లయల ,ఒకే ఒక్క ఆధారమా!నా భావములో బాహ్యములో,భాసించే అవ్యక్త రూపమా!ఎరుక కలుగ నీవే నేను,నేనే నీవు అద్వైతమా!అవిచ్ఛిన్నానంద సుఖాబ్ది, అద్వైత సిద్ధి నిధానమా!_________
ఆవేదనే నివేదన.:- డా పివిఎల్ సుబ్బారావు,-9442058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి