పిల్లలం ఆడపిల్లలం
ఆడజన్మ ఎత్తిన మేం
బతికి బట్ట కట్టిన మీ
తెల్లని వన్నెల మల్లెలం !
కొందరు స్కానింగును తీయించి
ఆడపిల్ల అని తేలగానే ద్వేషించి
జన్మనిచ్చే ఆతల్లిని తెగ వాయించి
క్షోభ పెడుతున్నారు సతాయించి!
మా తల్లి గర్భంలో మేం ఉండా
పసి గుడ్డని గూడా చూడకుండా
మా ప్రాణాలను ఇక తీసేస్తున్నరు
ఆ తల్లిని నిస్త్రాణం చేసేస్తున్నరు
కనిపెంచే అమ్మల్లారా నాన్నల్లారా
ప్రత్యక్ష దైవాలైన ఓ మా పెద్దల్లారా
మీచెవులారా మాగోడును వినండి
మీ కనులారా మాగాధను కనండి !
పెంచి పోషించే ఓ అమ్మ నాన్నలు
చెప్పించండి మాకు చదువు సంద్యలు
గర్భంలో శిక్షించే బుద్ధిని వదలండి
మమ్ముల రక్షించే దిశవైపు కదలండి !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి