తాతకు సాయం:- నరాల ప్రసన్న -ఆరవ తరగతి - జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల- జిల్లా సిద్దిపేట.9704865816

 ఒక ఊరిలో ముసలితాత ఉండేవాడు.అతనికి భార్యా, పిల్లలు చనిపోయారు.కొన్ని రోజుల క్రితం పక్షవాతం వచ్చింది.కాళ్ళు,చేతులు నడవకుండా ఐనవి.కట్టె సహాయంతో ఇంటి,ఇంటికి అడుక్కొని తినేవాడు.అతని ఇంటి ప్రక్కన సోని అనే 6వ, తరగతి అమ్మాయి ఉండేది.తాత అంటే సోనికి చాలా ఇష్టం.ప్రతిరోజు తాత ఇంటికి వెళ్ళి చదువుకునేది.తను తినే అన్నంలోంచి కొంచెం తాతకు పెట్టేది.తాత దేవతల కథలు, బూచోని కథలు, తెనాలి రామలింగని కథలు చెప్పేవాడు.పాటలు కూడా పాడేవాడు.సోని!నీవు ప్రతి రోజూ బడికి వెళ్ళాలి.పాఠాలు మంచిగా వినాలి.పెద్దగైన తర్వాత డాక్టర్ వు కావాలి. మా లాంటి ముసలివాళ్లకు ఆసుపత్రి కట్టించాలి.
మంచి మందులు ఇవ్వాలి. అని సోనికి చెప్పేవాడు.సోని ప్రతిరోజు బడికి వెళ్ళేది.
సోని బడిలో సోమవారం,
బుధవారం మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టేవారు.సోని గుడ్డు తినకుండా సంచిలో దాచి పెట్టుకునేది.ఇంటికి తీసుకెళ్లేది.ఈ విషయాన్ని ప్రీతి చూస్తుంది.సారుకు చెపుతుంది.సారు సోనిని పిలిపించి గుడ్డు ఎందుకు ఇంటికి తీసికెళ్లుచున్నావు అని బెదిరిస్తాడు.సోని ఏడుస్తుంది.మీ అమ్మా,నాన్నలను అడుగుదాం పదా అని సారు అంటాడు.సోని భయపడుతు నేను గుడ్డును ఒక తాతకు ఇస్తున్నాను సారు అని అంటుంది.ఇది అంతా అబద్దం సార్ అని ప్రీతి అంటుంది.
అందరు కలిసి తాత ఇంటికి వెళుతారు.తాత మంచంలో పడుకొని ఉంటాడు.సారు నిజం తెలుసుకుంటాడు.బడికి వస్తాడు.ఇంత చిన్న అమ్మాయికి ఎంత మంచి ఆలోచన వచ్చింది అని సంతోషపడతాడు. ఉపాధ్యాయులందరికి చెపుతాడు.ప్రార్థన సమయంలో అందరి ముందు సోనిజేసిన మంచి పనిని మెచ్చుకుంటాడు.అందరు చప్పట్లు కొడతారు. ప్రధానోపాధ్యాయులు గారు సోనిని మెచ్చుకొని మంచి బహుమతి అందిస్తాడు. 
కామెంట్‌లు