సాధనతో జీవితం సఫలం అవుతుందని తెలుసుకో
రాయి సైతం ఉలి దెబ్బలు తింటేనే రూపాన్ని ధరించి మ్రోక్కబడుతుందని తెలుసుకో
బీడుభూములు సైతం నాగలితో కడుపు చీల్చుకుంటేనే మంచి పంటలు ఇస్తాయని తెలుసుకో
తరువులు ఎండకేండి వానకు తడిసి చలికి తట్టుకొన్నప్పుడే
రసవంతమైన ఫలాలు, ప్రాణావాయువునిచ్చేదని తెలుసుకో
చివాట్లుతిన్నవాళ్లే చిదరించ బడ్డవాళ్లే సన్మానించబడతారని తెలుసుకో
ఒక్క అడుగుతో ప్రయాణం మొదలుపెడితేనే గమ్యాన్ని చేరుకుంటావని తెలుసుకో
రూపాయి రూపాయి కలిస్తేనే కోటి అవుతుందని తెలుసుకో
అమావాస్య తరువాతనే పున్నమి వస్తుందని తెలుసుకో
జీవితంలో చీకటి తర్వాతనే వెలుగులు వస్తాయని తెలుసుకో
కష్టాలు అనుభవిస్తేనే కష్టం విలువ తెలుస్తుందని తెలుసుకో
సమస్యతో కుంగిపోకు సమస్యకు పరిష్కారము ఉందని తెలుసుకో
గులాబీ ముళ్ళు తాకందే గులాబీ తెంపలేరని తెలుసుకో
ప్రతిఒక్కరి జీవితంలో సమస్య ఉందని తెలుసుకో
ప్రతిఒక్కరూ సాధన చేస్తేనే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలుసుకో
సాధనతో జీవితం సఫలం అవుతుందని తెలుసుకో.
====================================
భైరగోని రామచంద్రము
స్కూల్ అసిస్టెంట్, తెలుగు
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజ్ భవన్,
సోమాజిగూడ, హైదరాబాద్.
500041.
చరవాణి :9848518597
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి