ప్రేరణ :- ఉండ్రాళ్ళ రాజేశం-సిద్దిపేట -9966946084
             చిన్నరేవు గ్రామంలో ఐశ్వర్య అనే అమ్మాయి పదవ తరగతి చదువుతున్నది. ఐశ్వర్య చదువులో చాలా వెనుకబడి ఉండసాగింది. ఆరు మాసాల పరీక్షలు పూర్తయినా ఐశ్వర్య ఉత్తీర్ణత మార్కులు మాత్రమే సాధించేది. ఉపాధ్యాయులు ఎంత చెప్పినా, ఐశ్వర్యలో మార్పు రావడం లేదు. చదువును తేలికగా తీసుకోసాగింది.
               ఐశ్వర్యతో పాటుగా చాలామంది పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే చాలు. అన్నట్లుగా ఐశ్వర్యను అనుసరించసాగారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు విద్యార్థులను గమనించాడు. ఎలాగైనా వారిలో మార్పు తేవాలని, ఒక చక్కని పథకం వేసి, విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగేలా ప్రేరణ కల్పించడంలో నిష్ణాతులైన శిక్షకులు కృష్ణమూర్తిని పాఠశాలకు పిలిపించారు. 
                ప్రతి వ్యక్తి పుట్టగానే తగినంత హోదాలలో ఉండరని, కష్టపడి సాధించి, శోధించి అత్యున్నత స్థాయికి చేరుకుంటారని, కష్టేఫలిగా పేదవారు కూడా విద్య ద్వారా అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తారని పలు ఉదాహరణలతో ప్రేరణ శిక్షకులు కృష్ణమూర్తి విద్యార్థులకు వివరించారు. కృష్ణమూర్తి మాటలు ఐశ్వర్య మెదడుకు చాలా పదును పెట్టాయి. ఒక్కసారిగా ఐశ్వర్య తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని, బాగా చదివి పదవ తరగతిలో అత్యధిక మార్పులు సాధించింది. ఐశ్వర్యతో పాటుగా పాఠశాల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస కూడా సంతోషించారు. 
              ఐశ్వర్య కష్టపడి పైచదువులం చదివి ఉన్నత స్థాయిలో నిలిచి, చిన్నప్పుడు తనలాగే వెనుకడుగు వేసేవారికి ఐశ్వర్య స్ఫూర్తినిచ్చే మాటలతో తానూ ప్రేరణ శిక్షకురాలుగా మారి బాలలకు అండగా నిలువ సాగింది.


కామెంట్‌లు