మాసన్ పల్లి అనే గ్రామంలో మాధవి అనే ఒక అమ్మాయి ఉండేది.తండ్రి పేరు సోమయ్య.తల్లి పేరు సుమతి.వాళ్ళది మధ్యతరగతి కుటుంబం.మాధవికి ఇద్దరు సోదరులు సుమన్,అఖిల్. మాధవి ఒకతే కూతురు కావడం వల్ల గారాబంగా పెంచారు. కానీ చదువు విషయంలో వివక్ష చూపించేవారు.
సుమన్ మరియు అఖిల్ ప్రైవేట్ బడికి వెళ్లి చదువుకునేవారు. మాధవిని మాత్రం వాళ్ళ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు.
మాధవి ఎంతో శ్రద్ధగా చదువుకునేది.ఆటపాటలలో ముందుండేది.వాళ్ళ అన్నయ్య సుమన్ చదువు పూర్తి అయిన తర్వాత అతని ఒక మంచి ఉద్యోగం వచ్చింది. కుటుంబం కొంచెం పడుతుంది.అతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు.పెళ్లయిన కొత్తలో వాళ్ళ వదిన బాగానే ఉండేది.మంచిగా మాట్లాడేది.కానీ కొన్ని రోజుల తర్వాత తను మాధవి పట్ల కఠినంగా, కోపంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.మాధవిని పై చదువులు చదివించడం ఆమెకు అసలు ఇష్టం ఉండేది కాదు.పెళ్లి చేసి అత్తవారింటికి పంపాలని ఆమె ఆలోచన. అదే విషయాన్ని తన భర్తకు పదేపదే చెప్పేది డబ్బులు దండ గాని లేనిపోనివి నూరు పోసేది.ఆ విషయాన్ని తన భర్త, అత్తమామలతో ఎప్పుడు చెబుతుండేది.కోడలు బాధపడలేక చిన్న వయసులోనే తన కూతురుకు పెళ్లి చేయాలని మాధవి తల్లిదండ్రులు అనుకుంటారు.ఒక మంచి కుటుంబంలో అబ్బాయిని చూస్తారు.తన పేరు శేఖర్.తను చాలా బాగా చదువుకున్నాడు.మాధవికి ఇష్టం లేకుండానే తన ఇంటర్మీడియట్ అయిపోగానే వివాహం చేశారు.తను డిగ్రీ చదివి కలెక్టర్ కావాలని ఆమె కోరిక.వివాహంతో తన ఆశలన్నీ ఆవిరైపోయాయి చాలా బాధపడేది.పెళ్లయిన కొన్ని నెలల తర్వాత తన చదువు గురించి అత్తమామలకు,భర్తకు చెప్తుంది.ఆమెకు చదువు మీద నా ఇష్టాన్ని గౌరవిస్తారు.పై చదువులు చదువుకోవడానికి అందరూ అంగీకరిస్తారు.భర్త మంచివాడు. మాధవిని ఒక మంచి డిగ్రీ కళాశాలలో చేర్పిస్తాడు.కష్టపడి చదివే గుణం కల మాధవి నిరంతరం పుస్తకాలతో కుస్తీ పట్టేది.డిగ్రీ పూర్తయిన తర్వాత పోటీ పరీక్షల శిక్షణ కోసం హైదరాబాద్ వెళుతుంది.తన లక్ష్యం కలెక్టర్ కావడం,బాలికలకు మరియు వృద్ధులకు సహాయం చేయడం.ఆ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు చెప్తుంది.వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చదువుకోమని బాగా ప్రోత్సహిస్తారు.రాత్రి పగలు కష్టపడి బాగా చదువుతుంది. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మానాన్నల గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది.వారి గురించి బెంగ పెట్టుకుంటుంది.వారు ఎలా ఉన్నారో అని కలవరిస్తుంది.నేను కలెక్టర్ అయ్యాక వారిని మంచిగా చూసుకుంటానని సమాధాన పరుచుకుంటుంది.భార్య మాటలు విని అన్నయ్య తన చదువును ఆపాడని బాధపడుతుంది.తర్వాత కాలంలో వారి తల్లిదండ్రులను కూడా ఇబ్బంది పెట్టడం ఆమెకు చాలా బాధనిపించింది.
ఇవన్నీ గుర్తుకు వస్తున్నా,తన లక్ష్యం కోసం కష్టపడింది.ఆమె అనుకున్న కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించింది. ఆడపిల్లలు దేనినైనా సాధిస్తారని నిరూపించింది.తన తల్లిదండ్రులను తన వద్దకు తెచ్చుకొని,అత్తమామలతో పాటు బాగా చూసుకో సాగింది.చెడు వ్యసనాలకు బానిసై, ఆడంబరాలకు పోయి అప్పుల పాలైన అన్నా వదినలు తమ తప్పు తెలుసుకొని మాధవిని క్షమించమని కోరుకుంటారు. వాళ్ళ మాటలు విని మాధవిని చదువు మాన్పించి,పెళ్లి చేసినందుకు తన తల్లిదండ్రులు కూడా చాలా బాధపడతారు. అన్నా వదినలను, తల్లిదండ్రులను,మనస్ఫూర్తిగా క్షమిస్తుంది. సమాజంలో మార్పు రావాలి మీ తప్పు ఏమి లేదని ఓదారుస్తుంది.మాధవి ఒక మంచి అధికారినిగా ప్రజలలో పేరు తెచ్చుకుంటుంది.బాలికలు,వృద్ధుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా జీవిస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి