సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-797
"అతి సర్వత్ర వర్జయేత్" న్యాయము
*****
అతి అనగా ఎక్కువ, అధికము, పరిమితి దాటినది ఏదైనా.సర్వత్ర అనగా అన్ని చోట్లా. వర్జయేత్ అనగా విడిచి పెట్టాలి,వర్జించాలి, విడిచి పెట్ట వలసిందే అని అర్థము.
అతిని అన్ని చోట్లా విడిచి పెట్టాలి. అతి చేయడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి.అందుకే ఈ సూక్తిని మన పెద్దవాళ్ళు నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం.
అయితే ఈ  క్రింది సూక్తి మొత్తాన్ని చదివితే, దాని గురించిన వివరాలు తెలుసుకుంటే మన పెద్దలు ఎందుకు అంతగా ఈ సూక్తిని ఉదహరిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు.
అతి దానాత్ హతః కర్ణః అతి లోభాత్ సుయోధనః!/అతి కామాత్ దశగ్రీవో అతి సర్వత్ర వర్జయేత్!!"
అనగా మితి మీరిన దానం వలన కర్ణుడు చంపబడ్డాడు.విపరీతమైన లోభం వలన దుర్యోధనుడు/సుయోధనుడు చంపబడ్డాడు. మితిమీరిన కామం వలన దశ కంఠుడైన రావణాసురుడు చంపబడ్డాడు.అందుకే అతి అనేది అన్ని చోట్లా వర్జింపబడవలసిందే అని అర్థము.
 కర్ణుడికి దాన కర్ణుడు అని పేరు.తన ప్రాణానికి హాని కలుగుతుందని తెలిసి కూడా కపట వేషంతో వచ్చి అడిగిన ఇంద్రుడికి పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను వలిచి ఇస్తాడు. మహా భారత సంగ్రామంలో  ఓడిపోతాడు.అందుకేత.
అలాగే  పాండవుల తరఫున రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని కనీసం ఐదు ఊర్లన్నా ఇవ్వమని అడిగితే తన అహంకారం,లోభత్వంతో ఇవ్వక పోవడం వల్ల మహాభారత యుద్ధానికి దారి తీయడం మనందరికీ తెలిసిందే.అతడి లోభం అతడినే కాకుండా ఎంతో మంది ప్రజల మరణానికి కారణం అయ్యింది.
ఇక  అతి కామంతో రాముని భార్య సీతను అపహరించిన రావణాసురుడు తనను వివాహం చేసుకొమ్మని అడిగితే నిరాకరించినందుకు సీతను అశోకవనంలో బంధిస్తాడు. అతడి అతి కామమే రాముని చేతిలో చావుకు కారణమైంది.
ఇలా హద్దుమీరిన కోరికలు  ఏనాటికైనా పతనానికి దారి తీస్తాయని మనకు ఈ విషయాల పట్ల తెలిసిపోయింది.
 కేవలం ఇవ్వేనా "అతి" అంటే .. కాదు కాదు ఇంకా చాలానే ఉన్నాయి.
తాగడం, పేకాట నేడు ఓ గొప్ప అలవాటు అయిపోయింది. సరదాగా మొదలు పెట్టిన  ఈ అలవాటు చివరికి వారి పతనానికి దారి తీయడం మన చుట్టూ ఉన్న సమాజంలో నిత్యం చూస.
అతి చనువు,అతి నవ్వు,అతి జూదం ,అతి వేట,అతి కోపం,అతి మాటలు,మోహమఇలా ఏదైనా సరే అత్యాశ ,అతి కామం,అతి తిండి ,అతి నిద్ర,అతి డబ్బు, అతి శుభ్రత, సంపాదన, అతిగా మాట్లాడటం మొదలైనవి పనికిరావు.వాటి ముగింపు చివరకు  వినాశనమునకు దారితీస్తాయని మనం ఈ ఉదాహరణల యుక్తంగా తెలుసుకోగలిగాం.
 ఇవండీ "అతి సర్వత్ర వర్జయేత్ " న్యాయము రావడానికి,అనడానికి గల కారణాలు. వీటిలో ఏమైనా ఉంటే శ్రీఘ్రమే వాటిని దూరం పెడదాం.మీరూ నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు