ఆడపిల్లలు!!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
బురదలో పుట్టిన కలువలు 
వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!

బురదలో పుట్టిన విలువలు 
వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!

అడవిలో పుట్టిన చెవుల పిల్లులు 
వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!

సముద్రంలో పుట్టిన చేప పిల్లలు 
వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!!

ఆకాశంలో పుట్టి రాలే తోకచుక్కలు 
వాళ్లు-వాళ్ళూ  ఆడపిల్లలు!!

భూలోకంలో పుట్టిన పద్మాలు 
వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!

ఈ లోకంలో మళ్లీ పుట్టకుండా 
ఉండాల్సిన వాళ్లు -వాళ్లూ  ఆడపిల్లలు!!?

విలువైన వాళ్లు- బరువైన వాళ్లు 
పరువైన వాళ్లు- వాళ్లూ ఆడపిల్లలు!!

జంటగాను- ఒంటరిగాను 
ఉండలేని వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!

మళ్లీ ఈ లోకంలో పుట్టకుండా 
ఉండాల్సిన వాళ్లు -వాళ్లూ ఆడపిల్లలు!!!?

డా ప్రతాప్ కౌటిళ్యా 👏

కామెంట్‌లు