నలుపు తెలుపులు
తల్లితండ్రులు
కాంతి కాంతలం మనం!!
చీకటి రాత్రులు
కన్నవాళ్ళు
వెలుగు నక్షత్రాలం మనం!!
సూర్యచంద్రులు
తల్లితండ్రులు
ఇంద్రధనస్సులం మనం!!
గగన మేఘాలు
కన్నవాళ్ళు
సాగర కన్యలం మనం!!
గాలి వాన
తల్లిదండ్రులు
ఉప్పొంగే వాగు వంకలు మనం!!
ఉరుములు మెరుపులు
కన్నవాళ్ళు
సాధు సముద్రాలం మనం!!
తూర్పు పడమరలు
మన ఇల్లు!!
ఉత్తరా దక్షిణలు
మనవాళ్లు!!
ఎరుపు ఆకుపచ్చ రక్తం మనం!!?
*"""*******
మున్నా భేగం గారికి నివాళులు.
**********
డా ప్రతాప్ కౌటిళ్యా 👏
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి