తొలి గురువు తల్లి:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
అమ్మ ఇంట మొదటి గురువు
సదనములో కల్పతరువు
అనురాగాలకూ నెలవు
గుండెల్లో పెట్టి కొలువు

అమ్మ లేక ప్రగతి లేదు
ఆమె లేక జగతి లేదు
ఒక్క క్షణం దూరమైన
కుటుంబాన వెలుగు రాదు

త్యాగానికి మారుపేరు
జనం మేలు తల్లి కోరు
ఆకాశము బహు చిన్నది
పోల్చగా మనసు  పెద్దది

అమ్మ ఉన్న లోటు లేదు
ఆమె లేని చోటు లేదు
అనురాగ దేవత ఇంట
ప్రేమానురాగాల పంట

అమ్మ మనసు చూడ వెన్న
సృష్టిలోన మిగుల మిన్న
సదనంలో కాంతి ప్రమిద
అమె వలన ఉండు వసుధ


కామెంట్‌లు