తేట నీట విరిసిన తొలి తామర
స్వచ్ఛమైన మనసుతో రవిని
స్వాగతించగా వేచి నిలిచె
కనుల జ్యోతులు వెలిగించి..
ఎదిగివచ్చు బింబపు
దిగివచ్చు కిరణాలు
నీటి మీద రాసిన కవితలు
చేప పిల్లలు చదివె సందడిగా!
బంగారు వెలుగులు
పొంగారు చెరువున
నింగి నిలిచి చూడసాగె
తొంగి అద్దములోన....
తెలి వెలుగులు తెచ్చు
తొలి కిరణపు కలములు
నీలి నింగిపై లిఖించె
మేలి రంగుల చిత్రమేదో!
వేకువ తెచ్చే తెల్లని
వెలుతురు కాగితాన
విలువైన భావాలను వ్రాసుకుని
మేలైన పొద్దుగా మలచుకోమని..
శుభ కామనలతో...
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి